29, మార్చి 2011, మంగళవారం

హాస్య కవితలు -జై సిరంజీవ

ఉప్పు తింటే బీపీ హోరు
   తీపి తింటే షుగరు జోరు
   రెండూ దిల్ మాంగే మోరు
   ఆపుకోలేక ఆస్పత్రిలో చేరు


 
అవసరానికి వాడాలి సెల్లు  ఫోను  
వాహనంపై వాడరాదు సొ ల్లుఫోను
అజాగ్రత్త గుంటే ప్రాణాలు గిల్లు ఫోను
అతిగా వాడితే జేబుకి చిల్లు ఫోను

రోజూ మింగాలి గుప్పెడు మాత్రలు
వారానికోసారి ఆస్పత్రి యాత్రలు
నడివయసులోనే ముసలి పాత్రలు
అందుకే పాటించాలి ఆరోగ్య సూత్రాలు

ముక్క కోసి పంపితే పే థాలజీ 
ముక్కకోసి ఆడితే పే కాల జీ
ముక్కకోసి పంచితే సోషలిజం
కుక్క తోక వంకర తీస్తే జర్నలిజం

ఆస్పత్రి చూ స్తే  హ్యా పీ 
డాక్టర్ని చూ స్తే లో బీపీ
నర్సుని  చూస్తే లో బీపీ
బిల్లు చూస్తే నో బీపీ

dr రమణ యశస్వి

యశస్వి హాస్పిటల్
కాకాని రోడ్
గుంటూరు
సెల్ -9848078807
మణ 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి