10, అక్టోబర్ 2013, గురువారం

న్యు మరిక్కులు

న్యు మరిక్కులు
 
2 .స్నే 'హ మ్' 
 
స్నేహ మొక జోల పాటరా 
స్నేహితుడొక దేవదూత రా
స్నేహితుల కను రె  ప్పలకూ  మనసులు
అపనమ్మ కాలే కంట్లో నలుసులు
చెలిమి గుండె గోడకు బలిమిరా
 
 
3 .మాయ తెర
 
గడిగది లో బుల్లి తెర
కనురెప్పల మధ్య రంగు తెర
జీవితమొక డైలీ సీరియలు
గుండె క 'వాటాల 'రిమోటు కంట్రోల్
మనసు తడిసి ఆరే మాయ తెర

4, అక్టోబర్ 2013, శుక్రవారం

మినీ కవిత
ఆయన
తల్లిదండ్రులు సన్నకారు
వుండేదేమో పల్లెటూరు
తాగేదేమో గంజినీరు
 పిల్లలు సావనీరు
అప్పులో ళ్లు బతకనీరు
అందకేమో సాగునీరు
విషం తాగి పోయినారు
ఆత్మహత్యగా రాసినారు
లక్ష డబ్బు నూకినారు
డా రమణ యశస్వి

రైతు హాలిడే



రైతు హాలిడే
 
పొలంతో
వేసవి
ఎడబాటు కాలాన్ని
ఆశల కొడవళ్ళతో కోసేసి
ఋతు రాగాలను ఆలపిస్తూ
బీడు భూమిలో
నెర్రె లిచ్చిన నేలపై పడుకొని
వేల కళ్ళ ఆకాశంవైపు
వేయి కళ్ళతో
ఎదురు  చూస్తున్న కర్షక జీవికి 
మేఘాలు
వురితాళ్ళను పేనుతున్న శబ్దం
ఉరుములై గర్జిస్తుంటే
అన్నదాత కనురెప్పలు
ప్రమాద సూచికలై
రెప రెప లాడుతో
వర్షిస్తున్న కళ్ళను
ఓదారుస్తున్న దృశ్యం
మెరుపులా ఆవిష్కరిన్చబడుతోంది
గగన కాన్వాసుపై
రాలిన     చినుకు
మరుజన్మ రైతన్న
కంటిలో అన్నట్లు
జలజల  రాలిన కన్నీరు
ఎడమ భుజంపై కండువాని తడిపేసి
ఈ కాసేపన్నా చల్లంగుండు బాబాయి
అని దీవిన్చినట్లుంది
కండువా కుడి భుజంపైకి మార్చుకొని
తడబడుతున్న అడుగులతో
తను బలం పెట్టి పోషించిన
నేలతల్లిని తాకి
'ఋణం తీర్చుకోలేనమ్మా '
అంటూ ఇంటి ముఖం పట్టాడు
కడుపులో ఎలుకలు పరుగెడ్తుంటే
తను నడుస్తున్నాడు
ఏసీ రూముల్లో వారి
బొజ్జలు నింపిన తన రెక్కలని
ఎండిన డొక్కలు ఎక్కిరిస్తుండగా
 అమ్మాయి పెళ్లి ,అబ్బాయి చదువు ,అప్పులు
నకిలీ విత్తనాలు ,కరెంటు  కోత,ఎండిన కాలవ
గుర్తోస్తుండగా నడుస్తూనే వున్నాడు
 పంట విరామం  అని తెల్సుకొని
విస్తుపోయి
పురుగు మందు కొట్టిన చేతులతో
పుడమి తల్లి చేదు మందు
తను తాగేసాడు
అది నకిలీదని, ప్రాణం పోదని తెల్సుకొని
 తడిసిన కండువా
మెడలో బిగించి
పశువుల కొట్టంలో
రాజకీయ బలిపశువు
అయ్యాడు
క్రాప్ హాలిడే కాదు
హాఫ్ హాలిడే కాదు
ఫుల్ శలవు ప్రకటించాడు
వికటించిన బ్రతుకు బండి ఈడ్చలేక
మరో కష్టజీవి
మరో  బడుగు
మరో ప్రపంచంలోకి
తడిసిన కండువా తో.
 
డా.రమణ యశస్వి

నరకపు తడి (అను లంచాల లఘు కావ్యం)

ఓట్లు రాలు కాలం


 
వచ్చే వచ్చే ఓట్లు  రాలు కాలం
తెచ్చే తెచ్చే నోట్లు వేయు గాలం
రచ్చ రచ్చ రాజకీయ మాయాజాలం
పిచ్చ పిచ్చ గా మన' సారా 'బ్రతుకు వేలం
 
ఆలోచించి గుద్దాలి తటస్థ ఓటర్స్
తస్మాత్  జాగ్రత్త   వుంటారు చీటర్సు
చోటా నేతలవుతారు మనీ మేకర్స్
పుట్టు కోస్తారు ఇక పవర్ బ్రోకర్స్
 
తీరం దాటాక తగలేస్తారు తెప్ప
తక్కెట్లో నిలుస్తుందా రాజకీయ కప్ప
తస్మాత్ !ఇస్తారు చేతికి చిప్ప
ఎవరు చెప్పగలరు బుద్ధి వారికి నువ్వు తప్ప
 
డా. రమణ యశస్వి  

ఓట్లు రాలు కాలం

ఓట్లు రాలు కాలం
 
నేడు రాజకీయాలు
అడుగడుగునా అవినీతి మయాలు
తెరచాటున రౌడీ మాఫియాలు
చట్టమంటే లేవు భయాలు
సేవ మాటున ఓటు బ్యాంకు ఆశయాలు
ఓ ! ఓటరన్నా
 
డా రమణ యశస్వి
 
పంచుతారు నోటు
పెట్టేస్తే రేటు
పోసిన నాటు
కాటేస్తే చేటు
అందుకే నమ్ముకో ఓటు
అమ్ముకోకు ఓటు
ఓ ! ఓటరన్నా
 
డా రమణ యశస్వి
 
అర్ధాలు మారిన పొత్తు
వేస్తె చాలు ఎత్తుకు పై ఎత్తు
ఒకళ్ళ తోక మరొకరి సొత్తు
నోటు దువ్వెనతో దువ్వుతారు జుత్తు
అయిదేళ్ళు తింటారు  నీ  భవిష్యత్తు
ఓ ! ఓటరన్నా 
 
 
ఓట్లు రాలు కాలం
 
అవినీతి అనకొండ
నీతి మంచుకొండ
చట్టం చల్ల కుండ
అధికారం గుడ్డిఎండ
పేదరికం గుదిబండ
 

 
 
 డా రమణ యశస్వి

votlu raalu kaalam

మండుతున్న ఎన్నికల కొలిమి
గద్దెనెక్కే వారు డబ్బు తోనే చెలిమి
ఓటే ఓటరుగా నీ బలిమి
ఒటేయ్యక    తప్పదు ఎవరో ఒకరికి
 జాగ్రత్త ! మిగిలేది వేలిపై చుక్కే చివరికి
మేము కోరట్లా రామ రాజ్యం
మీరు పోయ్యకుంటే చాలు అగ్నికి ఆజ్యం
చెయ్యొద్దు పేదోళ్ళ నిధులు భోజ్యం
ప్రతిదీ రాజకీయం చేస్తే ఏదీ కాదు సాధ్యం
పగిలే పొట్టలకు ఇక పెట్టాలి డబ్బుల పత్యం
దానం కాని దానం వాగ్దానం
మతం కాని మతం రెట మతం
గతం కాని గతం దురాగతం
తల కాని తల నేతల తల
ఓటు కాని ఓటు వెయ్యని ఓటు
నిన్న ఓట్ల బెగ్గింగ్
నేడు దొంగోట్ల రిగ్గింగ్
సజావుగా సాగని ఓటింగ్
పోలీసుల తమాషాగా సీఇంగ్  
ప్రజాస్వామ్యం ఫాస్ట్ గా డయ్యింగ్
అందుకే వుండాలి రీ కాలింగ్
డా రమణ యశస్వి

ఓట్లు రాలు కాలం

మతమొక  గుణం
కులమొక వ్రణం
కుటిల రాజకీయమొక గ్రహణం
లంచమొక   మారణాయుధం
ఓ టొక వజ్రాయుధం
డా రమణ యశస్వి
ప్రచార ఘట్టం    సమాప్తం
నోటికి తాళం వేస్తం
నోటుకి రెక్కలు తోడుగుతం
నాటును ఫూటుగా పంచుతం
దొంగ ఓట్లని ఎతుకుతం
మాట ఇనని వారి భరతం పడతం
శవాలకి పార్టీల జండాలను చుడతం
గెలుపు మాదేనని ఎగురుతం
ఓడి,ఓటు వజ్రాయుధమని ఎరుగుతం
డా రమణ యశస్వి

satagni -sri sri pai kavita


ఓట్లు రాలు కాలం


ఓట్లు రాలు కాలం

ఓటరన్నా మేలుకో
ఓటు వజ్రాయుధం వాడుకో
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో
భవితకు బంగారు బాట వేసుకో
భావితరాలను ఆదుకో
 
ఎన్నికలప్పుడు ప్రజలకు దండాలు
గెల్చిన తర్వాత ప్రజలు పెట్టాలి దండాలు
పదవి తో సొంత వారికి అండదండలు
అందల' మెక్కిన' అవినీతి అనకొండలు
ఆఖరుకి అరదండాలు  
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
డా రమణ యశస్వి

ఓట్లు రాలు కాలం

ఓట్లు రాలు కాలం
 
ఆటాడుకో రిఫరీ సాక్షిగా
పెళ్లి చేసుకో అగ్నిసాక్షిగా
ఓటేసుకో మనస్సాక్షిగా
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
ఓటు వెయ్యి తప్పక
ఓటు వెయ్యి చెప్పక
వోటు వెయ్యి కోరక
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
ఓటు వజ్రాయుధం
నాటు మారణాయుధం
నోటు అవినీతి పథం
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
ఓ  టె  య్యకు       వేలం
ఓటుకు లేదు కులం
ఓటే నీకు సకలబలం
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
ఓటు ఒక వరం
నోటు ఒక బేరం
నాటు ఒక నేరం
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
ఓటు పెట్టకు మూలన
ఓటు మార్చును పాలన
ఓటు చూచును ఆలన
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
 
ఓటు చేయకు వేస్టు
ఓటు వేసుకో బెస్టు
ఓటుకు లేదు కాస్టు
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
ఓ టేయ్యి మనసారా
మానెయ్యి నాటు సారా
తీసెయ్యి బేర సారా
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
గురి చూసి వోటేసుకో
ఒళ్ళొంచి పని చేసుకో
భవిత నీదే చూసుకో
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
నేడు ఓటుకు ఇస్తారు వెయ్యి
రేపు చూపిస్తారు నుయ్యి
నిన్న చూస్తె అయిదేళ్ళ గొయ్యి
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
మెదడుకు మేతెట్టు
ఓటుకు పదునెట్టు
బూతుకు పరుగెట్టు
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
నేడు ఓటు నీ చిరునామా
రేపు పెడతారు పంగనామా
వాడుకో వీలునామా
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
 
డా రమణ యశస్వి

ఇంగ్లీష్ తెగుల్

మన విద్యా విధానం మాతృ భాష పర్తిరక్ష్ణ స్ఫూర్తి తోనే జరగాలి అని నా
ఉద్దేశ్యం .ఇప్పటికీ మాతృ భాష పరిరక్షణకు రాజ్యాంగం నిర్దేసిన్చిన రీతిలో
పరిపాలన మన రాష్ట్రం లో జరగడం లేదు .ఉదాహరణకి 2003 లో వచ్చిన GO ప్రకారం
వున్నత పాఠశాలా స్థాయి
వరకు తెలుగును ఒక పాఠ్యాం శం గా తప్పనిసరి చేస్తూ ఇచిన go ఇది. దాన్ని
ఇప్పటి వరకు అమలు చేయలేదు .ఇంగ్లీష్ తో పాటు మాతృ భాష ని సమంగా
నేర్పించినపుడే పిల్లల ఆలోచనా పరిధి పెరుగుతుంది త్రిభాషా సూత్రం దిశగా
మనం కదలాలి .అందుకు రాజకీయ మనసు ,ప్రజల వత్తిడి కలిసిరావాలి
తమిళనాడు లో లాగా భాషోద్యమ పవనాలు బలం గ వీయాలి .రేపు జరగబోయే ప్రపంచ
తెలుగు మహాసభలు ఇందుకు దోహదం చేసేలా ప్రణాలికలు సిద్ధం చేయాలి .మాత్రు
భాషోద్యమం మరింత శక్తి సంపన్న మయ్యేలా ఈ తెలుగు మహాసభలు పునాది వెయ్యాలి
ప్రాధమిక పా ట శాలల్లో గురువులు తెలుగునినేర్పించాడం నుండి ఈ ఉద్యమం
మొదలవ్వాలి .'జాని జాని ఎస్ పాప 'తో కాకుండా' చేతి వెన్న ముద్ద చెంగల్వ
పూదండ' వంటి గేయాలతో బాల్యాన్ని ఆరంభింపచేయాలి .మ న భాష సజీవం గా
ఉండాలంటే భావి తరాలకు దానితో అనుభంధమేర్పడాలి తెలుగు భాషా బోధకులకు
విలువనిచి వారికి పదోన్నతులు ,గౌరవ పురస్కారాలు ,ఇస్తే తెలుగు ని వారే
ఇనుమన్దిమ్ప చేస్తారు .'వుమ్మ నీరులోనే అమ్మ భాష' ఉంటుందని కనుక్కున్నా ఈ
రోజుల్లో ఆ అమ్మ భాషనే చులకన గ తీసెయ్యడం ఎంతవరకు సబబో
తల్లి దండ్రులు ఉపాధ్యాయులు ఆలోచన చేయాలి ఈ సందర్భంలో మన జాతి పిత గాంధీ
చెప్పింది గుర్తు చేసుకోవాలి 'బోధనా మాద్యమంగా మా తృ భాష వుండాలి
'అని.'విదేశి భాషలు మన పిల్లల పై తీవ్ర వత్తిడిని కలుగాచేస్తున్నాయి
తల్లి స్తన్యం  బిడ్డ యెదుగు దలకు    యెంత
ముఖ్యమో ,మాతృ భాష కూడా అంటే ముఖ్యం అని ఆయన ఆ రోజుల్లోనే  చాల సార్లు
వక్కాణించారు .మరో జన్మంటూ వుంటే తెలుగు భాష నా మాతృ భాష గ కావాలి అని
ప్రతి తెలుగు వాడు అనుకొనే స్థాయిలో ఈ తేనే తెలుగు భాషోద్యమం
ఊపందుకోవాలని ఆశిస్తూ

ఇక నా గురించి
నేను ఇప్పటి దాకా చాల కవితలు,కధలు  రాసాను .వాటిలో కొన్ని శీర్షికలు
-కరెంటు కవితలు,(ప్రస్తుత పరిస్తుతుల పై )కేబుల్ కవితలు ,కార్గిల్ కవితలు
(కార్గిల్ యుద్ధం పైన ),హైకూలు ,నానీలు ,న్యూమరిక్కులు ,జై సి రంజీవ
(మెడికల్ ప్రొఫెస్సిఒన్ పై న )రాజకీయాలు ,నేతలపై -'వోట్లు రాలు కాలం '
'రోటరీ శతకం '(రోటరీ ఉద్యమంపై )

తెలుగు ని చులకన చెయ్యడం పైన నా కవిత

ఇంగ్లీష్ తెగుల్

ఇంగ్లి పీచు చీడ పట్టిన తెలుగు భాష
ప్రతి ఏటా మాతృ భాషా ఉత్సవాల కం ట శోష
మమ్మీ డాడీల సంస్కృతికి బలైన అమ్మ భాష
భావితరాలకు కానివ్వకండి తెలుగు ఒక ఘోష
చేయకండి దేశ  భాష లందు తెలుగు లెస్సు  భాష

డా .రమణ యశస్వి
ప్రొఫెసర్ అఫ్ ఆర్తో
సిద్ధార్థ మెడికల్ కాలేజీ
విజయవాడ


క్షమించు శ్రీ శ్రీ

క్షమించు శ్రీ శ్రీ
 
మరోప్రపంచం లో
ఓ బుడ్డి శ్రీ శ్రీ కి
ఓ డాడీ డాంకీ
ఓ మమ్మీ మంకీ
వారి చేతుల్లో
ఓ ఇంగ్లీష్ బెత్తం
ఇక కధ మొదలయింది
ఓనమాలు దిద్దుతుంటే
ఓ! నో ! అని అరుపులు
ఛందస్సు నేర్చుకుంటుంటే
చాదస్తమని కస్సు బస్సు
సీస పద్యమంటే చెవుల్లో
సీసం పోసేలా వున్నారు
కంద మంటే మందమతని
మాడు పగులగొట్టారు  
మదర్ టంగుకి
అంగ్రేజీ ఫాదరు
క్రేజీ యాస పులిమాడు
రామా కిల్ డ్ రావణా అని
గిల్డు  భాషనీ అద్దారు
వేమన ఈజ్ ఏ నూర్ కవి
ఆయన రాసిన పద్యాలు
నూడుల్స్ అని చెప్పారు
మళ్ళీ పుట్టిన బుడ్డి శ్రీ శ్రీ
తెలుగు సిరా తాగినా
ఏ బీ సీ డీ ల కల్తీ వల్ల
మరగుజ్జు లాగా నే
మరో ప్రపంచం లో
తిరుగాడుతున్నాడు
క్షమించు శ్రీ శ్రీ
గాండ్రించి ఉమ్ము శ్రీ శ్రీ
 
శ్రీ శ్రీ కళ్ళు
 
అమరుడైన మహా కవి
మరణానికి పాతికేళ్ళు
శ్రీశ్రీ మళ్ళీ పుట్టాడనటానికి
లేవు ఆనవాళ్ళు
వస్తుంటే నేటి తల్లులకు
ఇంగ్లీషు ఏ విళ్ళు
నేటికీ శ్రీ శ్రీ సిరా చుక్కలే
విప్లవ తుపాకీ గుళ్ళు
కష్టజీవికి అటూ ఇటూ
శాశ్వత పహరా
శ్రీశ్రీ కవితా కళ్ళు
 
డా.రమణ యశస్వి
(శ్రీ శ్రీ జయంతి సందర్భముగా నేను రాసుకున్న కవితలు )
 
Dr Ramana Yashaswi
Yashaswi Hospitals
9848078807
www.yashaswihospitals.co

ప్రేమి స్నేహి

ప్రేమి స్నేహి

నలుగురిలో నువ్వు వున్నా
నీలో నువ్వు లేకుండా
చేసేది ప్రేమ

నీలో నువ్వు లేకున్నా
నీకంటూ మేము నలుగురము
ఉన్నాము  అంటూ
చెప్పే ధైర్యమే స్నేహం

ఈ రెండిటి మేలు
కలయిక  మహిళ


మహిళ దినోత్సవ శుభాకాంక్షలు


డా.రమణ యశస్వి

అర బాపు

అర బాపు
సాహితీ గులాబీలు   పూయించిన  ముళ్ళపూడి
స్నేహితుడు ఎలా వెళ్ళాడో బాపుని వీడి
నీ మాటలు లేక తగ్గును  సినిమా వాడి
నీ కలం సిరా   కవుల నరాల జీవ నాడి
అలసే రమణుడు   కోతి కొమ్మచ్చి  ఆడి
తెలు (గు) సు రుచి వుండదు
ఖరనామ  ఉగాది     పచ్చడి

డా రమణ యశస్వి

అడుగు

అడుగు
 
అమ్మ నేర్పిన తోలి అడుగు
జీవితపు బాటలో శుభాలు చెరుగు
 
అమ్మని నిలపకు అట్టడుగు
అమ్మ అడుగు జాడలె వెలుగు
 
సలహాలన్నీ అమ్మని అడుగు
జయాలన్నీ నీ వెంట పరుగు
 
అమ్మ ఆశీర్వాదం అడుగు
అనుకున్నవన్నీ జరుగు
 
అమ్మ సేవా భాగ్యం అడుగు
అదే శ్రీ రామ రక్ష గొడుగు
 
డా.రమణ యశస్వి
2011 అమ్మల దినోత్సవ సందర్భముగా

ఆంధ్రలో బెర్లిన్ గోడ

ఆంధ్రలో బెర్లిన్ గోడ


సందేహాల దేహాలు
అర్ధ రహిత రాద్ధాంత కర్తల
చేతుల్లో భాగించబడి
విభజించబడి
గాలిలో దీపాలై
తెలుగు తల్లి పాదాల చెంత
కొ డికడుతున్న నేపథ్యంలో
తెలుగోడి గుండె గోడలు
అనైక్య తెగులు పట్టి
సగం సగంగా పనిచేస్తుంటే
మనసులేని స్వార్ధ నేతల
కేరింతలు విన్న
ఆం ధ్ర మాత
బెర్లిన్ గోడ ధ్వంసమైనట్లు
తెలుగోళ్ళు మళ్ళీ ఏకమవ్వాలని
దీవిస్తోంది
కన్నీళ్ళ సాక్షిగా

రమణ యశస్వి

ఒంటి కంటి దృశ్యం

తల్లి స్తుతి స్తోత్రం (అమ్మ అర్ధ అష్టోత్తర శత నామావళి )

అమృత పాలమ్మ
అవ్యాజ ప్రేమమ్మ
అల్లారు ముద్దమ్మ
అసమాన వెన్నెలమ్మ
అభిమాన జాబిలమ్మ

అభివృద్ధి ఆకాం క్షమ్మ
అల'మేలు' మంగమ్మ
అభిమాన ధనమ్మ
అశాంతి ఆపమ్మ
అక్షర సత్యమ్మ
అపరంజి దేవతమ్మ
అపురూప సంధ్యమ్మ
అన్నిటా వె లుగొందమ్మ
అద్దమంటి మనసమ్మ
అలుపెరగని ఆసరాకొమ్మ
అలరించు పుత్తడి బొమ్మ
అలవోక చిలుక పలుకమ్మ
అమోఘత్యాగాల కన్నీటి చెమ్మ
 అహరహం క ష్టిం చు దీనమ్మ
అమ్మి ఆశల హరివిల్లమ్మ
అరుణ కాంతుల వనితమ్మ
అవృత యానంలో సబలమ్మ
అతీంద్రియ ఆది శక్తమ్మ
అపూర్వ కొలువమ్మ
అమ్మలగన్న అమ్మ
అపార ప్రేమల అమ్మమ్మ
అనుబంధాల బామ్మ
అసమాన అత్తమ్మ
అత్తింటి కోడలమ్మ
అల్లుళ్ళ ఆశమ్మ
అర్ధాంగి కూనలమ్మ
అవనిలో భర్త కన్నమ్మ
అమూల్య తులశమ్మ
స్నేహాల సఖియమ్మ
ఆణువణువు కరు ణ మ్మ
అరమరికల్లేని అరుణమ్మ
అసలైన అన్నపూర్ణమ్మ
అదృష్ట జాతకమ్మ
అనాది ప్రకృతి కన్నెమ్మ
అడుగడుగు  అ య స్కాంతమ్మ
ఆబల బంగారమ్మ
అష్ట ఐశ్వర్యాల అనుగ్రహమ్మ
అఖిల జనుల 'పుట్టు' గొమ్మ
అవతరించిన తిరుపతమ్మ
అలంకారాల పోలేరమ్మ
అపర కా ళ మ్మ
అనుదినం అనుగ్రహించమ్మ
అనుభూతుల అమరమ్మ
అమేయ మావుళ్ళమ్మ
అనురాగాల అంకమ్మ
అద్భుత తలపులమ్మ
అదిగో అల్లదిగో విశ్వ మాతమ్మ
అభివందనం గాయత్రీ స్వరూపమ్మ
అగ్రతాంబూలం నీకేనమ్మ

రమణ యశస్వి




--
Dr Sanka .Ramana Yashaswi
Yashaswi Hospitals
9848078807
www.yashaswihospitals.com
www.orthopedicsweb.com
www.support2walk.org
www.tulasivanam.org

జయహో సమై క్యాంధ్రమా

జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా
యాస  వేరైనా మన భాష  తెలుగు  భాష ఓరన్నా
 ప్రాంతాలు వేరైనా మన ఘోష  సమైక్య మే ఒరన్నా
  దేని కోసం ఈ   విభజన   ఓరన్నా
ఎవరి కోసం ఈ   విభజన ఓరన్నా

జయహో సమై క్యాంధ్రమా   
జయ జయహో తెలుగు తేజమా


కోనసీమ అందాలు ఓరన్నా
రాయలసీమ రత నాలు ఓరన్నా
తెలంగాణ బోనాలు ఓరన్నా
అన్ని కలిస్తే  ఆంధ్ర దేశమోరన్నా
 ముక్కలు చేస్తే అం ధ    కార మో రన్నా

జయహో సమై క్యాంధ్రమా  
జయ జయహో తెలుగు తేజమా

హైదరాబాదు మనందరి  సొత్తు ఓరన్నా
పెట్టకండి  ఇంకొకరి చేతులో మన జుత్తు ఓరన్నా
గాడి తప్పిన మన రాష్ట్రం ఓరన్నా
 కుంటుపడిన అభివ్రు ద్ధి పధం ఓరన్నా
 విడనాడి విభజన పోరు ,కలిసుంటే కలదు సుఖం ఓరన్నా

జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా

తెలుగు వారి ఆత్మ క్షోభ ఓరన్నా
పొట్టి శ్రీరాములు ఆత్మ ఘోష ఓరన్నా
 తెల్లబోయిన తెలుగు భాష ఓరన్నా
తల ,మొండేలు విడిపోతే ఆడదు  శ్వాస ఓరన్నా
విభజన ఆపి అనిపించుకోండి శభాష్ అనిర ఓరన్నా


జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా
దేశ భాష లందు తెలుగు లెస్స ఓరన్నా
చేయకండి దేశ వాసులందు తెలుగు వారు లెస్సు ఓరన్నా
మనం ఒకే   తానులో ముక్కలం ఓరన్నా
 తెలుగు తేజో చుక్కలం మనం ఓరన్నా
ఐక మత్యమే మన బలమని చాటుదాం ఓరన్నా


జయహో సమై క్యాంధ్రమా  
జయ జయహో తెలుగు తేజమా
డా ర మ ణ యశస్వి



--
Dr Sanka .Ramana Yashaswi
Yashaswi Hospitals
9848078807
www.yashaswihospitals.com
www.orthopedicsweb.com
www.support2walk.org
www.tulasivanam.org