జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా
యాస వేరైనా మన భాష తెలుగు భాష ఓరన్నా
ప్రాంతాలు వేరైనా మన ఘోష సమైక్య మే ఒరన్నా
దేని కోసం ఈ విభజన ఓరన్నా
ఎవరి కోసం ఈ విభజన ఓరన్నా
జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా
కోనసీమ అందాలు ఓరన్నా
రాయలసీమ రత నాలు ఓరన్నా
తెలంగాణ బోనాలు ఓరన్నా
అన్ని కలిస్తే ఆంధ్ర దేశమోరన్నా
ముక్కలు చేస్తే అం ధ కార మో రన్నా
జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా
హైదరాబాదు మనందరి సొత్తు ఓరన్నా
పెట్టకండి ఇంకొకరి చేతులో మన జుత్తు ఓరన్నా
గాడి తప్పిన మన రాష్ట్రం ఓరన్నా
కుంటుపడిన అభివ్రు ద్ధి పధం ఓరన్నా
విడనాడి విభజన పోరు ,కలిసుంటే కలదు సుఖం ఓరన్నా
జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా
తెలుగు వారి ఆత్మ క్షోభ ఓరన్నా
పొట్టి శ్రీరాములు ఆత్మ ఘోష ఓరన్నా
తెల్లబోయిన తెలుగు భాష ఓరన్నా
తల ,మొండేలు విడిపోతే ఆడదు శ్వాస ఓరన్నా
విభజన ఆపి అనిపించుకోండి శభాష్ అనిర ఓరన్నా
జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా
దేశ భాష లందు తెలుగు లెస్స ఓరన్నా
చేయకండి దేశ వాసులందు తెలుగు వారు లెస్సు ఓరన్నా
మనం ఒకే తానులో ముక్కలం ఓరన్నా
తెలుగు తేజో చుక్కలం మనం ఓరన్నా
ఐక మత్యమే మన బలమని చాటుదాం ఓరన్నా
జయహో సమై క్యాంధ్రమా
జయ జయహో తెలుగు తేజమా
డా ర మ ణ యశస్వి
--
Dr Sanka .Ramana Yashaswi
Yashaswi Hospitals
9848078807
www.yashaswihospitals.com
www.orthopedicsweb.comwww.support2walk.orgwww.tulasivanam.org