29, మార్చి 2011, మంగళవారం

రెక్కలు

రెక్కలు

ఓ చేత్తో
శరీరానికి
మరో  చేత్తో
మనసుకి
వైద్య కవులు
 యశస్వులు
'(దృష్టి  'రెక్కల కవయిత్రి పద్మ కళ నా గురించి వ్రాసిన రెక్క ))


 నిజం
వెంటా డుతూనే
నీడ
లా గానే
ఆత్మ
కధలో

 అమ్మ నాన్నలే
 నిచ్చెన నాడు
వ్రు ద్ధా శ్రమం
పంచెన నేడు
రెక్కలొచ్చిన
 పిల్లలు


ఆకాశం
ఉరిమింది
మేఘం
మెరిసింది
నాన్న
అమ్మ


వారిద్దరే
వున్నారు
మాట్లాడుతూనే
వున్నారు
చెరొక
చరవా   ణి  లో 


నిశ్శబ్దంగా
పేపర్ చదువుతుం టే

నా రక్తం
మరుగుతున్న శబ్దం

రోడ్లు రక్తపుటేర్లు
అతివలు అరిటాకులు

మట్టి
వినాయకుడు
బుద్ధి లేని
 నాయకులు
నిమజ్జనం
జనానికి శుభాలు

డాలరు దయ్యం
పట్టిన రూపాయి
విదేశి పెట్టుబడు ల
భూతం ప్రత్యక్షం
రెక్కలొచ్చిన
ధరలు

ఆకాశంలో
ధరలు
పాతాళంలో
రూపాయి
రెక్కాడింది
డొక్క మాడింది

ఇంగ్లీషు
దొరసాని
తెలుగు
మంత్రసాని
అ ఆ ల తెరచాటున
ఏ బీ సీడీలు పుట్టించింది

పైరసీ
 సీడీలు
మాఫియా
మరోరూపం
టెక్నాలజీ దే
 ఈ పాపం


 చెట్లని
మిం గింది
తారురోడ్డు
అనకొండ
మనుషుల్నీ
వదలట్లేదు



గర్భాశయము
సంచీలు నింపుతోంది
గర్వాతిశయము
మని'షి' ని చంపుతోంది
అమ్మతనము
అమ్మకానికి



సమాచార
హక్కు చట్టం
అన్ని భాషల్లో
లభ్యం
అవినీతిది
కరెన్సీ భాష

బంద్
 సంపూర్ణం
పతాక
శీర్షికలలో
ఆర్టీసీ నష్టం
పరిపూర్ణం లెక్కల్లో


కులమే
కొలమానము
గుణమే
అప్ర ధా నము
రాజకీయమే
అస్తమానము

వరాల జల్లులు
మైకుల ఉరుములు
తారల మెరుపులు
ఉచిత తుఫాన్లు
ఓట్లు
రాలు కాలం


ఐక మత్యం
బలం చుక్క
విడిపోవడం
బలుపుము క్క
విభజనం
కలుపు మొక్క

స్నేహ
మాధుర్యం
పరిచయ
భాగ్యం
చిరునవ్వు
తుమ్మె దకే



బుర్ర
పాదరసం
మాట
చెరుకు రసం

నాయకత్వానికి
రెక్కలు


తాళి
బొట్లు బొట్లు గా
జారి
పోతోంది
ఒంటరి
రెక్కలు

కన్నీటి
ప్రవాహానికే
బుగ్గల
సొట్టలు

మనసు కి
మేకప్పు నప్పదు


మనసు
పక్షి
ఎగురు
తూనే వుంటుంది

రెక్కలు
హృదయంలోనే 

పిల్లల
కివ్వా ల్సింది
ఆస్తులు
కాదు

వేర్లు
రెక్కలు


నువ్వు
కల్సుకో
నీలో
నిశ్శబ్దాన్ని

నీతో
నువ్వు ప్రేమలో పడ్డట్లే

కడుపు
 పండింది
కల లు
పండాయి
కనులు 'నిద్ర
కాపురంలో


హృదయ
 మాగాణి పై
కల ల
నాట్లు వేసాయి కనులు
బంగారు భవిత
పండుతోంది

చిన్ని చిన్ని
సమస్యలు
దూది 
పింజలే
 హాస్య రసమే
ఔషధం

జీవితం
గాలిపటం
మనో ధైర్యమే
ఆ దా (ధా)రం
కష్టాల గాలికి
ఎదురేగడమే

మనో
 వేదన
యాతం వేసి
గుండెలో రక్తాన్ని
కన్నీరుగ
తోడింది


దాంపత్య
జీవన గడియారం
మంగళ సూత్రాల
లోలకం
సరిగా ఆడితేనే
మాంగల్య బలం

జీల కర్ర బెల్లం
మాగాణి మడి
తలపై
తలంబ్రాలు పడి
నూరేళ్ళ  పంటకు
బీజాలు

స్నేహ
మాధుర్యం
మోహ
సౌందర్యం
జీవిత నాణేనికి
అటు ఇటు

విలువలు
తగ్గాయి
వలువలూ
తగ్గాయి
మన(సు) దే
తప్పు ,మనందరిదీ

అర్ధం లేనిది
జీవితం
సార్ధకతే
పరమార్ధం
కాలం రెక్కలతో
పయనం సాగించు

మనసు
ఇంకుడు గుంత
భావాలు
ఇంకిపోవు
కలం చిమ్మేకొద్దీ
అది చలం
మానసిక
వొత్తిడి
ప్రతి పనీ
అత్యవస(శ )రమే
గుండెను
గురిపెడుతూ
అశాంతి
బరువు
శాంతి
కరువు
ఎగరలేని రెక్కలతో
అహింస పావురం

ఒంటి
కాలితో
గీత
దాటిన
ధర్మం కాలం చేసింది
 క లి కాలంలో

కాలం
నిత్య గర్భి ణి
కలం
నిండు గర్భి ణి
రెండూ రోజూ ప్రసవిస్తూనే
భవిష్యత్తునీ , స్వగతం నీ

బినామీల
సునామీ
స్విస్ బ్యాంకుల్లో
నల్ల డబ్బు వర్షించింది
పేద ప్రజల
కన్నీట సుడి గుండాలు


కాగితం
కలం
ప్రేమ
పక్షులు
మనసు
పార్కులో

ప్రేమ
పాము పగై
యాసిడ్
చిమ్మింది
 అందమేనా
శాపం




Dr Sanka .Ramana Yashaswi
Yashaswi Hospitals
9848078807
www.yashaswihospitals.com
www.orthopedicsweb.com
www.support2walk.org
www.tulasivanam.org





2 కామెంట్‌లు: