మతమొక గుణం
కులమొక వ్రణం
కుటిల రాజకీయమొక గ్రహణం
లంచమొక మారణాయుధం
ఓ టొక వజ్రాయుధం
డా రమణ యశస్వి
ప్రచార ఘట్టం సమాప్తం
నోటికి తాళం వేస్తం
నోటుకి రెక్కలు తోడుగుతం
నాటును ఫూటుగా పంచుతం
దొంగ ఓట్లని ఎతుకుతం
మాట ఇనని వారి భరతం పడతం
శవాలకి పార్టీల జండాలను చుడతం
గెలుపు మాదేనని ఎగురుతం
ఓడి,ఓటు వజ్రాయుధమని ఎరుగుతం
డా రమణ యశస్వి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి