ఓట్లు రాలు కాలం
ఆటాడుకో రిఫరీ సాక్షిగా
పెళ్లి చేసుకో అగ్నిసాక్షిగా
ఓటేసుకో మనస్సాక్షిగా
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
ఓటు వెయ్యి తప్పక
ఓటు వెయ్యి చెప్పక
వోటు వెయ్యి కోరక
మేలుకో ఓ ఓటరన్నా
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
ఓటు వజ్రాయుధం
నాటు మారణాయుధం
నోటు అవినీతి పథం
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
ఓ టె య్యకు వేలం
ఓటుకు లేదు కులం
ఓటే నీకు సకలబలం
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
ఓటు ఒక వరం
నోటు ఒక బేరం
నాటు ఒక నేరం
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
ఓటు పెట్టకు మూలన
ఓటు మార్చును పాలన
ఓటు చూచును ఆలన
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
ఓటు చేయకు వేస్టు
ఓటు వేసుకో బెస్టు
ఓటుకు లేదు కాస్టు
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
ఓ టేయ్యి మనసారా
మానెయ్యి నాటు సారా
తీసెయ్యి బేర సారా
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
గురి చూసి వోటేసుకో
ఒళ్ళొంచి పని చేసుకో
భవిత నీదే చూసుకో
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
నేడు ఓటుకు ఇస్తారు వెయ్యి
రేపు చూపిస్తారు నుయ్యి
నిన్న చూస్తె అయిదేళ్ళ గొయ్యి
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
మెదడుకు మేతెట్టు
ఓటుకు పదునెట్టు
బూతుకు పరుగెట్టు
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
నేడు ఓటు నీ చిరునామా
రేపు పెడతారు పంగనామా
వాడుకో వీలునామా
మేలుకో ఓ ఓటరన్నా
వాడుకో ఓటు వజ్రాయుధమన్నా
డా రమణ యశస్వి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి