నరకపు తడి
(అను లంచాల లఘు కావ్యం)
సగటు
సుబ్బారావు
ఐ.సి.యు.ఏ.సి.లో సేద
తీరుతున్నాడు
వైద్యులు
నవ రంధ్రాలు ఆక్రమించి
ప్రాణం
పోకుండా మోకాలడ్డి
కరెన్సీ
కట్టలకు ప్రాణాలు పోస్తున్నారు
మెదడు
పట్టీ ఇ. ఇ. జి.
తరంగాలు
అతని
మనసు వేగాన్ని అందుకోలేక
యంత్రం
తెర పై గుర్రంలా
పరుగెడుతున్నాయి
అంగుళము
తేడా లేకుండా
పట్నంలో
బిల్డింగు కట్టాలను కోవటమే
నేరమై
వెంటిలేటరు
శిక్ష
అనుభవిస్తున్నాడు
'రూలు
రూలే
మామూలు
మామూలే' అని
కొత్త
స్లో 'గన్ 'తో
జనులకు
స్లో పాయి జను
ఇస్తున్న
మునిసిపాలిటీ వాళ్ళు
ప్లాను '
(దే )ఉడా' అని
మొరపెట్టుకున్నా
'సీటు
సీటు తడిపితేనే 'అని
మొరాయించిన
ఉడా
దెబ్బకు
షాకయ్యాడు
కార్యాలయములో
ఎక్కడ
చూసినా తడి ,తడి ,తడి
పొలాల్లో లేదు
వాగుల్లో
లేదు
అధికారుల
బల్లల కింద తడి
శ్రీ శ్రీ గారు తడి (వుమను,వైను)లో
స్వర్గం ఉందన్నాడు
కానీ ఇది 'నరకపు తడి '
అందరికి
తడిపి తడిపి
గొంతు
తడారి పోయింది
అ ఆ లు రాని
తాపీ మేస్త్రి
తాపీగా
పనులు చేసి
అవినీతి
మరో కోణం
రుచి
చూపించాడు
డీ అర్కులు దళారులై
లంచానికి
డబులు 'కాటు '
మంచము
వేసి పోషించారు
ఫె యింటు
,ఫెయింటు అంటూ
పెయింటరు
తన రక్తాన్నే
రంగులుగా
మార్చి
'పులి'మిన గోడను చూసి
ఫెయింట్
అయ్యాడు
ప్రతి
సీటులో
ఒక హస్త (రా)లా
ఘవలావు
'ర 'పలకని 'ల' క్ష్మే కొడుకులు
అవినీతి
విశ్వరూపం
ఆవిష్కరించారు
కొత్త
భవనంలో పట్టుమని
పదినెలలు
వ్యాపారం
చే యలేదు
మూలిగే
నక్క మీద
'బీ ఆర్ ఎస్' తాటికాయ వేసారు
మున్సిపాల్టి
వారు
ఎంతోకొంత
డీవి ఏషను
వుంటుంది
లెండీ
ముందు
మూడు లక్షలు కట్టి
తర్వాత
ఆలోచించుకో
అధికారుల
వాదనలో
ప్రభుత్వం
ఖజానా నింపు
కొత్త
రకం అవినీతి
కళ్ళ
ముందు ప్రత్యక్షమయిన్ది
కళ్ళు
బైర్లు కమ్మాయి
అయి సీయు ఏ సీ
లో
సేద తీరుతున్నాడు
సగటు
సుబ్బారావు
డా రమణ యశస్వి
గుంటూరు
![]() ![]()
We will keep this for future issues of KOUMUDI
With Best Regards
KiranPrabha http://www.kiranprabha.com ![]() | |||||||||||||||||||||||||
4, అక్టోబర్ 2013, శుక్రవారం
నరకపు తడి (అను లంచాల లఘు కావ్యం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి