వచ్చే వచ్చే ఓట్లు రాలు కాలం
తెచ్చే తెచ్చే నోట్లు వేయు గాలం
రచ్చ రచ్చ రాజకీయ మాయాజాలం
పిచ్చ పిచ్చ గా మన' సారా 'బ్రతుకు వేలం
ఆలోచించి గుద్దాలి తటస్థ ఓటర్స్
తస్మాత్ జాగ్రత్త వుంటారు చీటర్సు
చోటా నేతలవుతారు మనీ మేకర్స్
పుట్టు కోస్తారు ఇక పవర్ బ్రోకర్స్
తీరం దాటాక తగలేస్తారు తెప్ప
తక్కెట్లో నిలుస్తుందా రాజకీయ కప్ప
తస్మాత్ !ఇస్తారు చేతికి చిప్ప
ఎవరు చెప్పగలరు బుద్ధి వారికి నువ్వు తప్ప
డా. రమణ యశస్వి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి